కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతిపై నేడు WHO భేటీ

-

అత్యవసర వినియోగపు అనుమతుల కోసం భారత దేశీయ తయారీ కోవాగ్జిన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను తయారు చేసింది. కాగా గత కొన్ని రోజుల నుంచి కోవాగ్జిన్ అత్యవసర వినియోగం కోసం WHO సాంకేతిక సలహా గ్రూప్ చర్చిస్తోంది. నేడు కూడా మరోసారి నేడు WHO సాంకేతిక సలహా గ్రూప్ భేటీ కానుంది. పలు మార్లు అదనపు సమచారం కావాలని కోవాగ్జిన్ తయారీ సంస్థను కోరింది. అక్టోబర్ 26న చివరి సారిగా భేటీ అయిన WHO సాంకేతిక సలహా గ్రూప్ మరోమారు మరింత సమాచారం కావాలని కోరింది. కోవాగ్జిన్ 77.8 శాతం కోవిడ్ వ్యాధిపై సమర్థవంతంగా పనిచేస్తుందని… కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ ను 65.2 శాతం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నివేదిక అందించారు. క్లినికల్ 3 ట్రయల్స్ సమాచారాన్నిసదరు సంస్థకు అందించారు.

గత వారం జరిగిన జీ20 సమావేశంలో కరోనాపై సమర్థవంతంగా పోరాడాలంటే వ్యాక్సిన్ల కు అత్యవసర అనుమతిని త్వరితగతిన WHO ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది 500 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను భారత్ తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం సాకారం కావాలంటే కోవాగ్జిన్ కు WHO అత్యవసర వినియోగపు అనుమతులు తప్పని సరి కానుంది. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్, మెడెర్నా, సినోఫార్మ్, ఫైజర్ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగపు అనుమతులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news