ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఫేస్ బుక్ పేరు మెటా అని మారస్తున్నట్టు ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఫేస్ బుక్ లో ఇప్పటి వరకు ఉన్న ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను మెటా మొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తెలిపారు.
అయితే ఈ ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది అనే అరోపణ ఫేస్ బుక్ పై ఉంది. అందు వల్ల నే ఈ ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ ను ఫేస్ బుక్ నుంచి పూర్తి గా తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే దీని కోసం ఉపయోగించే టెంప్లేట్ లను కూడా పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఈ టెంప్టేట్ లో దాదాపు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ముఖ గుర్తింపు సమాచారం ఉంటుంది. అయితే ఈ ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ ను ఫేస్ బుక్ 2010 లో తీసుకువచ్చింది.