దీపావళి ఎఫెక్ట్… సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాణాసంచా బాధితుల క్యూ

-

దీపావళి వచ్చిందంటే చిన్నలు పెద్దలు బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం బాణాసంచా విషాదాన్ని మిగులుస్తోంది. ప్రతీ ఏడు బాణాసంచా పేలుడు కారణంగా సున్నితమైన కళ్లు దెబ్బతింటున్నాయి. దీంతో  దీపావళి అనంతరం సరోజిని దేవీ కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా దీపావళి పటాసుల పేలుడు కారణంగా ఇప్పటి వరకు 31 మంది బాధితులు సరోజిని దేవీ కంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తంగా వచ్చారు. ఇలా వచ్చిన వారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు స్వల్పంగా గాయపడిన వారికి వైద్యులు  చికిత్స చేసి పంపించగా.. తీవ్రంగా గాయపడిన 5గురికి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా బాణాసంచా పేలుడు కారణంగా కంటి పై పొరలో యాష్ పడిన వారికి కళ్లను శుభ్రపరిచి ఇంటికి పంపిస్తున్నారు. పేలుళ్ల కారణంగా కంటి లోపల గాయాలు అయిన వారికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు.

ప్రతీ ఏటా దీపావళి అనంతరం బాణా సంచా పేలుళ్ల వల్ల చిన్న పిల్లలు గాయపడుతున్నారు. ముఖ్యంగా కంటికి దెబ్బతగలడం వల్ల కంటి చూపు పూర్తిగా లేకపోతే పాక్షికంగా కోల్పోతున్నారు. వైద్యులు, నిపుణులు ఎంతగా చెప్పినా..కనీస రక్షణ చర్యలు పాటించపోవడంతో ఇటు వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news