ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ.

-

ఈ నెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈభేటీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్నినికోబార్, లక్షద్వీప్ లెఫ్ట్నెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై ఇటీవల సీఎం జగన్ సమీక్షించారు. అయితే ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని రాష్ట్రాల ముందు సీఎం జగన్ లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాల వివాదాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ విభజన హామీలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news