ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు, రైతులు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో జరుగున్న ధర్నాలో హరీష్ రావు కేంద్రంపై, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పంజాబ్ కు ఓనీతి.. తెలంగాణకు మరో నీతా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో వేసవి కాలం దొడ్డు బియ్యమే పండుతుందని.. వాటిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లను కొనుగోలు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్లాన్నారు హరీష్ రావు. దేశ ద్రోహం పేరు చెబుతూ మీరు భయపెడితే.. భయపడం అని అన్నారు. రైతులపైకి కార్లు ఎక్కిండం దేశ భక్తా..? గాంధీని ఒక వర్గానికి పరిమితం చేస్తూ.. గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడటం దేశ భక్తా అని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. ఏడాదిగా రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ధర్నాలు చేస్తున్నారు మీకు కనబడటం లేదా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్రం బాధ్యత అని.. దాని నుంచి కేంద్రం తప్పుకుందని విమర్శించారు. బీజేపీ గుణపాఠం చెప్పడానికే ఈ ఆందోళన అని రైతులకు విడమర్చి చెప్పాలన్నారు.
సీఎం అయినా వ్యవసాయాన్ని మరవని నేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. రైతుల కోసం ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిందన్నారు. రైతుకు రూ. 5 లక్షల బీమా దేశంలో ఏరాష్ట్రంలో లేదన్నారు. రైతుల బాధలు కేసీఆర్ కు తెలుసు అని అన్నారు. రైతుల కోసమే గోదావరి నీటిని తీసుకువచ్చాం అని తెలిపారు.