మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? మీరు కార్డు లేకుండానే ఏటీఎం నుండి డబ్బులని డ్రా చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా సులభంగా డబ్బులని మీరు తీసుకోచ్చు. డబ్బులు డ్రా చెయ్యడానికి వెళ్ళినప్పుడు మీరు కనుక మీ యొక్క కార్డు ని మరిచిపోయినట్టైతే ఏం టెన్షన్ పడకండి.
యోనో సహాయంతో మీరు ఈజీగా డబ్బులని పొందొచ్చు. ATMల నుండి అలాగే POS టెర్మినల్స్ , కస్టమర్ సర్వీస్ పాయింట్ల నుండి డబ్బులని తీసుకోచ్చు. అయితే మీరు డబ్బులని తీసుకోవాలంటే కచ్చితంగా యోనో యాప్ ఉండాలి. మినిమమ్ రూ. 500 , మాక్సిమం రూ. 10,000 వరకు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఎలా కార్డు లేకుండా డబ్బులు పొందొచ్చు అనేది చూస్తే..
దీని కోసం మొదట యోనో యాప్ ఓపెన్ చేసి లాగ్ ఇన్ అవ్వండి.
నెక్స్ట్ మీరు హోమ్ పేజీలో యోనో క్యాష్ పై క్లిక్ చేయండి.
అక్కడ మీరు ATM విభాగంపై క్లిక్ చేయండి.
ఇప్పుడు మొత్తాన్ని ఎంటర్ చెయ్యండి.
6 అంకెల పిన్ని క్రియేట్ చెయ్యాలి.
యోనో ట్రాన్సక్షన్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఇది 6 గంటల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
ఇప్పుడు ఏటీఎం లో యోనో క్యాష్ ని సెలెక్ట్ చెయ్యండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన యోనో నగదు లావాదేవీ నంబర్ తో పాటు 6 అంకెల పిన్ను నమోదు చేయాలి.
ఇప్పుడు మీరు క్యాష్ ని తీసుకోవచ్చు.