ఖమ్మం కారులో సెగలు…పంక్చర్లు పడేలా ఉన్నాయి!

-

రాజకీయాల్లో నేతల వలసలు అనేవి సహజమే. నాయకులు అవకాశాన్ని బట్టి పార్టీలు మారిపోతూ ఉంటారు. అలాగే పార్టీలు సైతం అవసరాన్ని బట్టి ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తీసుకుంటాయి. అయితే ఒక లిమిట్ వరకు నాయకులని తీసుకుంటే ఇబ్బంది ఉండదు…కానీ ఎప్పుడైతే లిమిట్ దాటేస్తారో అప్పుడు తిప్పలు తప్పవు. నాయకుల ఓవర్ ఫ్లో అయ్యి…ఆధిపత్య పోరు పెరిగి…నాయకుల మధ్య అసమ్మతి సెగలు ఎక్కువయ్యి ఆ పార్టీలకే డ్యామేజ్ జరిగే పరిస్తితి ఉంటుంది.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పరిస్తితి కూడా అంతే…మొదట్లో టీఆర్ఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండేది కాదు…కానీ వరుసగా 2014లో తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నేతలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు…అయినా ఇతర పార్టీ ఎమ్మెల్యేలని, నేతలని పార్టీలో చేర్చుకున్నారు.

ఇలా అడ్డు అదుపు లేకుండా పార్టీలోకి నాయకులని తీసుకున్నారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో టీఆర్ఎస్ గెలిచింది ఒక్క సీటు మాత్రమే…కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 2 గెలుచుకుంది. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కానీ టీఆర్ఎస్ అధికార బలంతో కాంగ్రెస్‌కు చెందిన 4, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనిఓ కారు ఎక్కించేశారు.

అలాగే ఇంకా బలమైన నేతలని కూడా చేర్చుకున్నారు. దీంతో కారులో అసమ్మతి సెగలు రావడం మొదలయ్యాయి..ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు…టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉదాహరణకు పాలేరులో టీఆర్ఎస్ తరుపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు…కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. గెలిచాక ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో తుమ్మలకు, ఉపేందర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది…పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. ఇలా దాదాపు ఖమ్మం జిల్లా అంతా అదే పరిస్తితి. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరుతో కారుకే పంక్చర్లు పడేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news