లక్ష్మీస్ ఎన్టీఆర్, మహానాయకుడు. రెండూ ఎన్టీఆర్ బయోపిక్సే. అయితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబును బ్యాడ్ గా చూపిస్తుండటం, వెన్నుపోటును స్పష్టంగా వెల్లడిస్తుండటంతో చంద్రబాబుకు అది మింగుడుపడటం లేదు. ఫిబ్రవరి 22న మహానాయకుడు రిలీజ్ అవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పందించారు.
కొందరు కావాలని ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు వర్మ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఎన్టీఆర్ నిజ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఉందని… అందుకే… ఎన్టీఆర్ గురించి తెలుసుకోవడానికి కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చూడాలని తెలిపారు. అంటే పరోక్షంగా… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడొద్దని చెప్పినట్టేకదా.
అక్కడే మండింది వర్మకు. దీంతో ఓ పోల్ ను పెట్టాడు తన ట్విట్టర్ లో. నాది కుట్రా లేక నిజమా? అని.. దానిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. అంతే కాదు.. మహానాయకుడు ట్రైలర్ లో రానా(చంద్రబాబు) ఉన్న ఓ సీన్ ను ఎడిట్ చేసి దాన్ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అది చంద్రబాబుకు మామూలు కౌంటర్ కాదు. ఇంతకీ అదేం వీడియోనో మీరే చూడండి.
CBN’s scared reaction on #LakshmisNTRtrailer pic.twitter.com/6gQOjmCE5Z
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019
.”ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారు….కుట్రదారుల దుష్ప్రచారాన్నితిప్పికొట్టాలి”—CBN
“నాది కుట్రా ? నిజమా?”—RGV
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019