రజిని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా..!

-

సూపర్ స్టార్ రజినికాంత్ పేట తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మురుగదాస్ డైరక్షన్ లో సినిమా మొదలు పెట్టనున్నాడు. లాస్ట్ ఇయర్ సర్కార్ తో మళ్లీ ఫాం లోకి వచ్చిన మురుగదాస్ సూపర్ స్టార్ రజినితో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో రజినికాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇదిలాఉంటే మురుగదాస్ సినిమాలో రజిని చేసేది డ్యుయల్ రోల్ అంటూ కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది.

రజిని సింగిల్ గానే సంచలనాలు సృష్టిస్తాడు అలాంటిది డ్యుయల్ రోల్ అంటే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. కబాలి, కాలా, 2.ఓ, పేట సినిమాలైతే చేస్తున్నాడు కాని రజిని ఇదవరకు రేంజ్ హిట్ కొట్టడంలో మాత్రం వెనుకపడ్డాడు. మరి మురుగదాస్ సినిమాతో అయినా అది నెరవేరుతుందో చూడాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రజిని ద్విపాత్రాభినయం అని తెలియగానే రజిని ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news