మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా…? దానితో మంచిగా లాభాలను పొందాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టారంటే మంచిగా లాభాలు వస్తాయి. పైగా పెట్టుబడి కూడా తక్కువే. ఇక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
మామూలుగా పచ్చగా ఉండే బెండకాయల్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే ఎరుపు బెండకాయలు కూడా మంచి రాబడి తీసుకు వస్తాయి. ఎరుపు బెండకాయల కి డిమాండ్ ఎక్కువగా ఉంది. సేంద్రీయ పద్ధతి లో సాగు చేసి ఈ బెండకాయల్ని మీరు పండించి మార్కెట్లో అమ్మితే అదిరిపోయే లాభాలని మీరు పొందొచ్చు.
పైగా ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. దీని కోసం తక్కువ పెట్టుబడిని పెడితే సరిపోతుంది. పైగా లాభాలు కూడా బాగా వస్తాయి. కనుక మీరు ఈ వ్యాపారం చేయొచ్చు. ఎక్కువ మంది దీన్ని సాగుచెయ్యరు. చాలా అరుదుగా దీనిని సాగు చేస్తారు. అయితే అధిక డిమాండ్ ఉంది కాబట్టి నష్టం ఏమీ ఉండదు. ఈ పంట చలి ఉండే ప్రాంతంలో బాగా పండుతుంది.
మామూలు బెండకాయలతో పోలిస్తే ఈ బెండ లో ఎక్కువ మొత్తం లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి ఎర్ర బెండ చాలా మేలు చేస్తుంది. ఇలా మీరు మంచిగా ఎర్ర బెండని సాగుచేసి మంచిగా సంపాదించుకోచ్చు.