ఓమిక్రాన్ పై కేంద్రం అలెర్ట్… రాష్ట్రాలకు గైడ్ లైన్స్ విడుదల

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని.. వ్యాక్సిన్ వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ రాష్ట్రాలకు లేఖలు రాశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లేఖలో సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. కరోనా హాట్ స్పాట్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జినోమ్ సీక్వెన్ల కోసం వెంటవెంటనే సాంపిల్స్ పంపేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శాకాలను రిలీజ్ చేసింది. corona-virus

ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు లేదా.. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నవారిని మాత్రమే ఆయా రాష్ట్రాల్లోకి అనుమతించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.