మహానాయకుడు ముంచేశాడుగా..!

-

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన మహానుభావుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులు నిరాశపరచాయి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఒక సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేశారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా టాక్ బాగున్నా వసూళ్లు రాలేదు. ఇక శుక్రవారం రిలీజైన మహానాయకుడు సినిమాకు టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఇక ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ షాక్ ఇచ్చాయని తెలుస్తుంది. బాలకృష్ణ కెరియర్ లో ఎప్పుడు రాని విధంగా మొదటి రోజు కలక్షన్స్ వచ్చాయట. పెద్దాయన బయోపిక్ భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇంత దారుణంగా విఫలమవడం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కేవలం 70 వేల డాలర్స్ మాత్రమే రాబట్టిన మహానాయకుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 50% ఆక్యుపెన్సీ రాబట్టిందట.

అంటే మొదటి రోజు మహానాయకుడు 4-5 కోట్లు మాత్రమే రాబట్టి ఉంటాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా లాసులతో డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకోగా మహానాయకుడు వారిని మరింత ముంచేశాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news