మీ భరతం పడతాం : వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్

-

వైసీపీ నేతలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతులు కట్టుకు కూర్చోలేదు..ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోమని మండిపడ్డారు. మళ్లీ మాటలు జారితే.. మీ భరతం పడతామని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు బాలయ్య. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారని… నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ఉన్నామో… పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు… హేళన చేయవద్దని మండిపడ్డారు బాలకృష్ణ. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారన్నారు బాలకృష్ణ. ఏకపక్షంగా సభ ను నడుపుతున్నారని..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమ నిస్తున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితేనని… ప్రజాసమస్యలపై పోరాడటమే అ సెంబ్లీ వేదికగా ఉండేదన్నారు. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసు కొచ్చారన్నారు బాలకృష్ణ. నోటితో కాదు, ఓటుతో జ‌వాబు చెప్పాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news