మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలకు సంబంధించి బిల్లులను రద్దు చేయనుంది. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటాం.. మీరంతా ఇంటికి వెళ్లండని ఇటీవల రైతులను మోదీ కోరారు. ఇదిలా ఉంటే రైతుల మాత్రం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే దాకా ఇళ్లకు కదిలే ప్రసక్తే లేదని అంటున్నారు.
తాజాగా భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కూడా తమ డిమాండ్లు నెరవేరే దాకా ఇళ్లు వెళ్లం అని స్పష్టం చేశారు. ఎంఎస్‌పి హామీ చట్టం, విత్తన బిల్లు, మిల్క్ పాలసీ వంటి మా అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కానందున ఆందోళన ఆగదని ఆయన అన్నారు. ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి, లేకుంటే మేం ఇంటికి వెళ్లం అని లక్నోలో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ అన్నారు. దీంతోపాటు నిససన కార్యక్రమాలను ఆపేది లేదంటూ రైతులు స్పష్టం చేశారు.