మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసంహరణ స్థానంలో మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టమని ఫైర్ అయ్యారు చంద్రబాబు. సీఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహించారు.
ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని… రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి నిర్ణయాల కారణంగానే ఏపీ ఇలాంటి పరిస్తితుల్లో ఉందని ఆగ్రహించారు. అటు మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడంతోనే అంతా అయినట్లు కాదని.. సీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయాల్సినవి చాలా ఉన్నాయని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు.
వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలు తదితర వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నాయని… వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని తెలిపారు. రైతులకు న్యాయంచేయాల్సిందేనని… రాజధానికి రూ.లక్షకోట్లు అవసరమవుతాయన్నది పచ్చి అబధ్దమని ఆగ్రహించారు. కాగా.. మూడు రాజధానులు బిల్లును రద్దు చేసుకుంటున్నట్లు సీఎం జగన్ ఇవాళ అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే.