పేరు ఏదైనా పెట్టుకోండి..అమరావతిని రాజధానిగా ఉంచాలి : టీజీ వెంకటేష్

-

కర్నూలు : పేరు ఏదైనా పెట్టుకోండి కానీ… అమరావతినే క్యాపిటల్ గా ఉంచాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్‌ చేశారు. అలాగే అమరావతిని అభివృద్ధి మాత్రం చేయాలన్నారు. ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదని… రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి
ఆలూ లేదు సోలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉందని చురకలు అంటించారు.

అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ చేయాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధాని ఉండేదని.. మా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ క్రిష్ణ కమిటీకి తెలియజేశామని గుర్తు చేశారు.

వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయండి…లేకపోతే రెండూ పోతాయన్నారు. వైజాగ్ లో సెక్రటేరియట్ పెడితే మాకు దూరం అవుతుంది. కాబట్టి కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని.. మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్లితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news