రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయ చట్టాలపై కీలక నిర్ణయం

-

రైతులకు కేంద్ర మరో గుడ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజు (నవంబర్‌ 29న) న “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది కేంద్రం. రైతు ఉత్పత్తి వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన) చట్టం-2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం-2020, రైతుల ధర హామీ, సేవలు ఒప్పందం (సాధికారిత, రక్షణ) చట్టం-2020లను రద్దు చేస్తూ ఈ నెల 29న బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

రైతుల ఆందోలను ఏడాది నుంచి చేస్తున్న నేపథ్యంలో నవంబర్‌ 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగలో “మూడు వ్యవసాయ చట్టాలను” రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. చట్టాల రద్దుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని ప్రధాని మోడి ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఈనెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో, మొదటి రోజే లోక్‌సభలో చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news