సుజనా ఫౌండేషన్ సీఈవో, సినీ నేపథ్యగాయని హరి నీ తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏకే రావ్ అనుమానాస్పద మృతి కేసులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును బెంగుళూరు రైల్వే పోలీసులు విచారన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకే రావు పాకెట్ లో పిర్యాదు కాపీ దొరికింది. ఎకె రావు లెటర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు బెంగుళూరు రైల్వే పోలీసులు. ఆ లెటర్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు పోలీసులు. ఇక నేడు పోలీసుల వద్దకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అందనుంది.
సిద్దగుంట పాళీ పీఎస్ లో నమోదు అయిన 150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏకే రావ్ ను వేధించిన వ్యక్తుల ఫై పోలీసుల ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఏకే రావ్ సెల్ ఫోన్స్ డేటా సేకరిస్తున్నారు. పలువురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. త్వరలోనే కేసును ఛేదిస్తామని వెల్లడించారు.