మనం పొద్దున్న లేవగానే చాలామంది చేసే పనులు ఫోను చూసుకోవటం. ఏమైనా మెసేజ్ స్ వచ్చాయా అని చూసుకుంటారు. తర్వాత బ్రష్ చేస్తారు. ఒకప్పుడు అంటే..వేపపుల్లలు వాడేవాళ్లు..కానీ ఈరోజుల్లో అలా ఎవరూ చేయటంలేదు..అందరూ టూత్ బ్రష్ లకే అలవాటు పడిపోయారు. మీకు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..అసలు టూత్ బ్రష్ మొదట ఎలా వచ్చింది.దేంతో తయారు చేశారు అని. వస్తే ఈ ఆర్టికల్ చూడండి..
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్ బ్రష్ వినియోగం ఉందట! ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రష్‌ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశమేనట. 600 ఏళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్‌లను పరిచయం చేసింది చైనా..జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్‌పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. అవును మీరు విన్నది నిజమేనండి. ఈ టూత్ బ్రష్‌పై ఉండే బ్రస్సెల్స్ చాలా గట్టిగా ఉండేవి. వీటిని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేసేవాళ్లు. ఈ వెంట్రుకలను వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లు తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్‌లను యూరప్, ఇంగ్లాండ్ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి.
1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్ ఈడిస్ అనే ఖైదీ కొత్తరకం బ్రష్ లు కనుగొనేంతవరకూ ఈ బ్రష్‌లనే వాడేవారు. ఆ కాలంలో విలియమ్ కూడా పంది వెంట్రుకలతోనే టూత్ బ్రష్‌ను తయారు చేసేవాడట. జైలు నుండి విడుదలయ్యాక ‘విజ్‌డమ్ టూత్ బ్రష్’ అనే కంపెనీని ప్రారంభించి, ఇంగ్లాండ్‌లో టూత్ బ్రష్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్‌లు తయారు చేయబడుతున్నాయి.
1950లో డుపాంట్ డె నెమోర్స్ అనే వ్యక్తి నైలన్ బ్రిస్టల్ టూత్ బ్రష్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. నవంబర్ 7, 1857లో హెచ్‌ఎన్ వడ్స్‌వర్త్ అనే వ్యక్తి టూత్ బ్రష్‌లపై పేటెంట్ పొందిన మొదటి అమెరికన్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత 1885లో అమెరికా దేశంలో పెద్ద ఎత్తున టూత్ బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది.
ఇలా క్రమక్రమంగా టూత్ బ్రష్లలో మార్పులు జరుగుతూ జరుగుతూ..ఇప్పుడు మార్కెట్లో రకరకాల కంపెనీలు వచ్చాయి. ఆప్షన్ లేకుంటే అందరూ అదే వాడతారు..కానీ మన ముందు ఇప్పుడు బోల్డెంత ఆప్షన్స్..