నా అభిప్రాయం చెప్పా శిక్ష విధించారు: బ్రాండ్ కాంట్రాక్టు రద్దుపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్

-

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. బీటౌన్‌లో నేమ్ ఫేమ్ ఉన్న నటి. తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకుంటే యాక్టివిస్ట్‌గా కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఎన్నో ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల్లో కూడా ముందుంది. ఢిల్లీలో రోజుల తరబడి జరిగిన ఆందోళనలకు తన మద్దతు తెలిపింది. అయితే, అదే స్వరా భాస్కర్‌కు ఇప్పుడు తలనొప్పులు తెచ్చి పెట్టింది.

సీఏఏ, ఎన్‌‌ఆర్‌సీపై తన అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ‘శిక్ష’ విధించినట్లు స్వర భాస్కర వెల్లడించింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఆందోళనల్లో పాల్గొనడం ‘బ్రాండ్స్’కు చెడ్డ పేరు తెచ్చిపెట్టానని ఆరోపిస్తూ తన బ్రాండ్ కాంట్రాక్టులను రద్దు చేశారని తెలిపింది. నేను విశ్వసించే దేశ రాజ్యాంగ విలువలకు కట్టుబడి వ్యవహరించినందుకు నన్ను శిక్షించారు అని స్వరా తెలిపారు. అయితే, తాను శిక్ష అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలుపడం కొసమెరపు.

Read more RELATED
Recommended to you

Latest news