వారికి బూస్టర్ డోసులు వేయండి… కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి హరీష్ రావు లేఖ

-

ఓమిక్రాన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కరోనా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడుతున్నారు. కర్ణాటకలో నమోదైన రెండు కేసుల్లో ఓ హెల్త్ వర్కర్ కు ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాలల్లో కూడా ఓమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తం అవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తూ ఆంక్షలు విధించింది.

harishrao

మరోవైపు బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వాలంటూ పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, హైరిస్క్ గ్రూపులకు బూస్టర్ డోసు అందించాలని హరీష్ రావు కేంద్రమంత్రిని కోరారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని లేఖలో కోరారు. రెండు డోసుల మధ్య వ్యవధి 12 వారాలు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. దీన్ని 4-6 వారాలకు తగ్గించాలని లేఖలో కేంద్ర మంత్రిని

కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news