ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి… సతీమణి వైఎస్ భారతి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో.. ఏపీ మంత్రి కొడాలి నాని.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. వైఎస్ భారతమ్మ పేదల పాలిట అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే.. గతంలో జగన్ , భారతి దిగిన ఫోటోను షేర్ చేశారు మంత్రి కొడాలి నాని.
”వై ఎస్ భారతమ్మ , రాజశేఖర్ రెడ్డి గారి కోడలిగా , జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా మాత్రమే బహిరంగ ప్రపంచానికి తెలిసిన భారతమ్మ నిజంగా ఆపన్నుల పాలిట అమ్మే. పులివెందులలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత పేదల వైద్యుడుగా పేరు గాంచిన మరో ఉన్నత వ్యక్తి EC గంగిరెడ్డి గారి పుత్రిక భారతమ్మ . ఎందరో పేదలకు తక్కువ ఖర్చుతో , లేని వారికి కొందరికి ఉచితంగా వైద్యం చేస్తూ 70 ఏళ్ల వయసులోనూ సేవాతత్వంతో ముందుకు వెళ్తున్న గంగిరెడ్డి గారి సేవా భావాన్ని అందిపుచ్చుకొన్న భారతమ్మ గారు , అంత కన్నా మిన్నగా ప్రజల్ని ప్రేమించే రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి కోడలయ్యారు. నేడు వైఎస్ భారతమ్మ జన్మదినం సందర్భంగా ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..” అంటూ ట్వీట్ చేశారు కొడాలి నాని.
https://www.facebook.com/KODALINANIgudivadaMLA