తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. సిఎం కేసీఆర్ వి ఊసరవెల్లి రాజకీయాలు అంటూ ఆగ్రహం వ్యాఖ్యమ చేశారు. రైతులను కోటీశ్వర్లు చేశానని గప్పాలు కొట్టే దొర గారు, ఆ రైతుల ఆదాయం నెలకు 1697 రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇక ఆ ఆదాయం కూడా రైతుకు మిగలవద్దని వరి వేయొద్దంటున్నారని.. ఒకసారి వడ్లు కొంటానంటావ్, మరోసారి వడ్లు కొనేది లేదంటావ్.
నీ ఊసరవెల్లి రాజకీయాలతో రైతులు ఆగమైతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారు వానాకాలం… వడ్లు కొనకుండా రైతులను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నరని మండిపడ్డారు. వరి వేసి ఉరి వేసుకునే బదులు, పంటలు వేయకుండా భూములను పడావు పెడుతున్నారని మండిపడ్డారు. పచ్చని పొలాల్లో ఉండాల్సిన రైతుకు సర్కారు పాడె కడుతోందని…. మీది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు. ఎవుసానికి ఘోరీ కట్టే ప్రభుత్వమని ఒ రేంజ్ లో ఫైర్ అయ్యారు.