దేశంలో కొత్తగా మరో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు… మొత్తంగా 25 చేరిన ఓమిక్రాన్ కేసులు

-

కరోనా కొత్త వేరయంట్ ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ కేసులు అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాల్లో 2300 కేసులు నమోదయ్యాయి. ఇండియాను కూడా ఓమిక్రాన్ వణికిస్తోంది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన పలువురికి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఇండియాలో మరో రెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇద్దరికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా అధికారులు నిర్థారించారు. ఇటీవల జింబాబ్వే నుంచి జామ్ నగర్ కు వచ్చిన ఎన్ఆర్ఐ వ్యక్తి ద్వారా అతని బంధువుకు కూడా ఓమిక్రాన్ సోకింది. ప్రస్తుతం వచ్చిన రెండు కేసులతో దేశంలో మొత్తంగా 25 ఓమిక్రాన్ కేేసులు నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్ లో 3, ఢిల్లీలో 1, రాజస్థాన్ లో 9, మహారాష్ట్రలో 10 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసులన్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, టాంజానియా దేశాల నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news