మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ముంబాయి కేంద్రంగా పని చేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ని భర్తీ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. సినియర్ ఎగ్జిక్యూటీవ్/డొమైన్ ఎక్స్పెర్ట్స్ విభాగంలో పోస్టులని భర్తీ చేస్తోంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 29ని చివరి తేదీగా నిర్ణయించారు.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఇందులో మొత్తం ఆరు ఖాళీలు వున్నాయి. చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, హెడ్ అనలిటిక్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. హెడ్-ఏపీఐ మేనేజ్మెంట్, హెడ్-డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. బీటెక్/బీఈ, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయంలోకి వస్తే… అభ్యర్థుల వయస్సు 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..
అధికారిక వెబ్ సైట్ (https://www.unionbankofindia.co.in/english/home.aspx) ను ఓపెన్ చేయాలి.
Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Click here to view current Recruitmentపై క్లిక్ చేయాలి.
మీరు తర్వాత Click here to Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయాలనుకున్న పోస్టు, పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
ఆ వివరాలతో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫామ్ ను కంప్లీట్ చేసి సబ్మిట్ చెయ్యాలి.