Big boss 5 : కాజ‌ల్ ఎలిమినేట్! సెకండ్ ఫైన‌లిస్ట్ గా స‌న్నీ?

-

బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ కు చేరుకుంది. హౌస్ లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్ర‌మే ఉన్నారు. అందు లో శ్రీ రామ్ చంద్ర టికెట్ టూ ఫినాలే లో గెలిచి నేరుగా ఫైన‌ల్ లో అడుగు పెట్టాడు. దీంతో హౌస్ లో ఉన్న కాజ‌ల్, స‌న్నీ, స‌రి, ష‌ణ్మూఖ్, మాన‌స్ నామినేష‌న్స్ లో ఉన్నారు. అయితే ఇందులో ఓటింగ్ లో స‌న్నీ టాప్ లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రయివేటు ఓటింగ్ సైట్ ల రిజ‌ల్ట్ కూడా బ‌య‌ట కు వ‌చ్చింది.

స‌న్నీ త‌ర్వాత ష‌ణ్మూఖ్ ఉన్నాడ‌ని తెలుస్తుంది. త‌ర్వాతి స్థానం లో సిరి ఉంది. అలాగే చివ‌ర్లో మాన‌స్, కాజ‌ల్ డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే చివ‌ర గా ఉత్కంఠ స‌మ‌యం లో మాన‌స్ సేవ్ అయిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వారం ఆర్ జే కాజ‌ల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ సెకండ్ ఫైన‌లిస్ట్ గా స‌న్నీ గెలిచిన‌ట్టు తెలుస్తుంది. అయితే గ‌త కొద్ది రోజు ల నుంచి స‌న్నీ కి ఫాలోయింగ్ విప‌రీతం గా పెరిగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఓటింగ్ లో ష‌ణ్మూఖ్ కు ఎక్కువ గా వ‌చ్చేవి. కానీ ప్రస్తుతం స‌న్నీ కి ఓట్లు ఎక్కువ గా వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news