ఇళ్లకు రైతులు.. హెలిక్యాప్టర్లతో పూల వర్షం

-

మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దు చేశారు)కు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళన చేసిన రైతులు ఇండ్లకు బయల్దేరారు. కనీస మద్దతు ధర సహా మిగిలిన అన్ని డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతు సంఘాల నేతలు గురువారం ఉద్యమ ప్రకటన చేశారు. సరిహద్దుల్లోని టెంట్లను తొలగించారు. శనివారం విజయోత్సవ ర్యాలీ అనంతరం తమ స్వస్థలాలకు ట్రాక్టర్లపై బయల్దేరి వెళ్లారు.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ట్రాక్టర్లపై రైతు సంఘాల నాయకులు స్వస్థలాలకు బయల్దేరారు. పంజాబ్- హర్యానా బార్డర్‌లోని షంబు సరిహద్దులకు రైతులు చేరుకోగానే హెలిక్యాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. దారి వెంట పూల వర్షం కురుస్తుండటంతో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుడు హెలిక్యాప్టర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news