ఇండియాలో కొత్తగా 7,081 కరోనా కేసులు..21 నెలల తర్వాత ఇదే మొదటిసారి

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఒకరోజు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి కరోనా కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,081 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 83,913 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 21 నెలల తర్వాత ఇదే మొదటి సారి.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 264 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,77,422 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7, 469 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,41,78,940 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,37,46,13,252 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 76,54, 466 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news