తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. 20 శాతం టికెట్ల ధరలు తగ్గింపు

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ చైర్మన్ సజ్జ నార్ శుభవార్త చెప్పారు. ట్రావెల్ యూస్ యు లైక్ టిక్కెట్ల ధరల పై 20% డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించారు సజ్జనార్. ఈనెల 18 వ తారీకు నుంచి 27 వ తారీఖు వరకు హైదరాబా ద్లోని ఎన్టీ  ఆర్ గార్డెన్స్ లో బుక్ ఫేర్ జరుగుతోంది. 34 వ ఈ బుక్ ఫెయిర్ ను ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 18 నుంచి 27 వ తారీఖు వరకు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించే వారి T24 టికెట్ల పై 20 శాతాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో వంద రూపాయలు ఉన్న… ఈ టికెట్ల ధరలు 80 రూపాయలకు చేరనున్నాయి. ఈ టికెట్లు పుస్తక ప్రదర్శన కేంద్రం వద్ద లభిస్తాయని సజ్జనర్ కూడా చేశారు. ఈ అవకాశాన్ని పుస్తకప్రియులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.