దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. దేశంలో 572 రోజుల కనిష్టా స్థాయికి కరోనా రోజూవారీ కేసులు చేరాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తుండటం కూడా కరోనా తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో సగటున రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నా… ఇండియాలో మాత్రం సగటున రోజుకు 10 వేల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ ఇండియాను కొద్దిగా కలవరపెడుతోంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 6563 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 132 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 8,077 మంది రికవరీలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 82,267గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.24 కాగా, రికవరీ 98.39, మరణాలు 1.37 శాతంగా ఉంది.
దేశంలో కరోనా వివరాలు..
యాక్టివ్ కేసులు- 82,267
కోలుకున్నవారు- 3,41,87,017
మరణాలు- 4,77,554
వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య-137,67,20,359