సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంటనూనెల ధరలు అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రిఫండ్ పామ్ ఆయిల్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన సుంకం 2022 మార్చి వరకు అమలులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా.. దేశీయ విపణిలో సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
బి సి డి తగ్గింపు కారణంగా రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ లపై మొత్తం సుంకం 19.25 శాతం నుంచి 13.75 శాతానికి తగ్గనుందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక కొత్త రేటు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం సోమవారం కిలో వేరుశనగ నూనె ధర రూ.181.48 , ఆవాల నూనె ధర రూ. 187.43, వనస్పతి రు.138.5 అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 163.18, పామాయిల్ రూ.129.94 గా ఉన్నాయి. శుద్ధిచేసిన పామాయిల్ లైసెన్స్ లేకుండా 2022 డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.