ముంబైకి చెందిన ఓ యువ నటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. భోజ్ పూరి లో ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న ఈ యువ నటి… డిసెంబర్ 20వ తేదీన తన స్నేహితులతో కలిసి హోటల్ లో పార్టీ కి వెళ్ళింది. అక్కడికి ఒక సారిగా ఎన్సి బి అధికారులకు పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి నటిని బెదిరించారు. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని.. ఆ ఫేక్ అధికారులు పట్టు బట్టారు.
పదేపదే ఫోన్ చేసి… ఆ యువనటి ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆ నటి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ నటి పేరు మాత్రం పోలీసులు బహిర్గతం చేయలేదు. అలాగే నటిని బెదిరించిన నిందితులు పరదేశి, పర్వీన్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. త్వరలోనే నిందితులను కోర్టు ముందు హాజరు పరుస్తామని స్పష్టం చేశారు అధికారులు