బయటపడుతున్న నోట్ల కట్టలు.. రూ.284కోట్ల నగదు పట్టివేత

-

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్‌ఫ్యూమ్ వ్యాపారవేత్త పీయుష్ జైన్ ‌ఇంట్లో జరిపిన సోదాల్లో పట్టుబడిన నగదు విలువ రూ.284కోట్లకు సోమవారం చేరింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నటలు సమాచారం. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

పీయూష్ జైన్‌కు చెందిన కనౌజ్‌లోని మూడు ఇండ్లలో నుంచి సోమవారం ఉదయం రూ.107కోట్ల నగదుతోపాటు రూ.కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లను గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన సేల్ డీడ్స్, డాక్యుమెంట్స్‌ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.

కనౌజ్‌లోని చుప్పటి ప్రాంతంలో నివాసం ఉండే పీయూష్ జైన్ గత కొద్ది సంవత్సరాలు తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం తన పూర్వీకుల బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చినట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు. అయితే, అను బంగారాన్ని ఎక్కడ, ఎవరికి విక్రయించాడో అధికారులకు వెల్లడించలేదు. అధికారులు పీయూష్ జైన్ కుమారులను కూడా విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news