కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు…రాష్ట్రాలు, యూటీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు..

-

దేశంలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 570ని దాటింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా కేంద్ర హోంశాఖ కూడా కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రాల్లో, యూటీల్లోని ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెంశాఖ సూచించింది.

corona

పండగ సీజన్లలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక, జిల్లా స్థాయిలో కఠిన, సత్వర నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, యూటీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర ఆదేశాలను 31 జనవరి 2022 వరకు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా పాటించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

ప్రస్తుతం దేశంలో 578 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర ల్లో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో 140కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news