ఆ విషయంలో కేరళ మొదటి ర్యాంకు… తెలంగాణ మూడో ర్యాంకు..

-

దేశంలో ఆరోగ్య విభాగం పనితీరుతో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిని విడుదల చేసింది. 2019-20 ఏడాదిలో ఆరోగ్య విభాగంలో వివిధ అంశాల పనితీరును పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను సిద్ధం చేసింది. ఆరోగ్య సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆరోగ్య విషయంలో కేరళ మెరుగైన చర్యలు కనబరిచినందుకు ఈ ర్యాంకును సాధించింది. ఇదిలా ఉంటే ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో ర్యాంకు సాధించింది. గతంలో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ తన ర్యాంకును మెరుగు పరుచుకుంది. మూడోస్థానంలో ఉన్న ఏపీ.. ఒక స్థానానికి దిగజారి నాలుగో స్థానంలో నిలిచింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో, వరల్డ్ బ్యాంక్ సాంకేతిక సాయంతో ఈనివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ నివేదికలో కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ నిలచింది. అయితే ఓ విషయంలో మాత్రం యూపీ మెరుగైన ప్రతిభ కనబరిచింది. 2018-19తో పోలిస్తే 2019-20 లో ఆరోగ్య ప్రమాణాల్లో ఉత్తర్ ప్రదేశ్ గణనీయమైన ప్రగతి జరిగినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్య సూచి చిన్న రాష్ట్రాల విభాగంలో మిజోరాం రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో నిలువగా.. జమ్మూ కాశ్మీర్ చివరి స్థానంతో దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news