హీరోలు నాని, సిద్ధార్డ్ కామెంట్లకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్… ఏ కిరాణా కొట్టు లెక్కలు చూశాడో అంటూ..

-

టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరల వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల హీరో నాని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. హీరో నాని గురించి వ్యాఖ్యానిస్తూ.. ’’ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఎక్కడ ఉంటారో.. ఎక్కడ ఏ కిరాణా షాప్ లెక్కలు చూడాడో నాకు తెలియదు. ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టుందో తెలియదని.. ఆయన ఏ సినిమా హాల్, ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కెట్టారో తెలియదని..తెలుసుకున్నాక మాట్లాడుదాం అని.. బహుషా ఆయన స్టెట్మెంట్ ఇచ్చారంటే.. బాధ్యతాయుతంగానే ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు.. సినిమా హాల్ కౌంటర్, పక్కనే అనుకుని ఉన్న కిరాణా కొట్టు కౌంటర్ రెండు లెక్కపెట్టి చెప్పి ఉండవచ్చు బహుషా..‘‘ అని మంత్రి పేర్ని నాని  కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల హీరో నాని.. శ్యాంసింగరాయ్ సినిమా విడుదలకు ముందు ఓ ప్రెస్మీట్ లో సినిమా థియేటర్ కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయన్న వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి పేర్ని నాని ఇలా స్పందించారు.

పనిలో పనిగా హీరో సిద్ధార్ద్ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ చెన్నైలో ఉంటాడని.. బహుషా ఆయన మాట్లాడింది తమిళనాడు సీఎం స్టాలిన్ గురించి, అక్కడ మంత్రుల గురించి కావచ్చు అంటూ.. చురకలు అంటించారు. చెన్నైలో టాక్స్ లు కట్టే సిద్ధార్ధ్ ఏపీ టికెట్ల గురించి ఎందుకని అన్నారు. మమ్మల్ని ఎప్పుడైనా చూశాారా… మేమేమైనా విలాసాల్లో బతుకుతున్నామని అన్నారు అంటూ.. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news