జగన్ కాదు కదా..వాళ్ల నాన్న, వాళ్ల తాత వచ్చినా అమరావతిని కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏం జరుగుతుందోననే అంశంపై కేంద్ర హోం శాఖ నిత్యం నిఘా వేస్తోందని…అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తల పైనా కేంద్రం కన్నేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్దంగా వ్యవహరించే అధికారుల పైనా కేంద్రం నిఘా పెట్టిందని…ఏపీ విషయంలో ఇకపై కేంద్రం ఏం చేయబోతోందోననే అంశాన్ని ప్రజాగ్రహ సభలో వివరిస్తామని చెప్పారు.
పేర్ని నాని, పయ్యావుల కేశవ్ కామెంట్లకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేస్తే మంచిదన్నారు. వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులపై కేంద్రం నిఘా వేసిందని హెచ్చరించారు. బీజేపీకి వైసీపీ-టీడీపీ రెండూ మాకు ప్రత్యర్ధి పార్టీలేనని…
జగన్, చంద్రబాబు ప్రధాని అయినా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ మారిపోయింది.. ప్రత్యేక హోదాతో వచ్చే ఫలాలను ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేంద్రం సిద్దమేనని స్పష్టం చేశారు. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు అర్ధం లేనివని మండిపడ్డారు.