ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో రాజకీయ నాయకులు బెయిల్ పై ఉన్నారు.. త్వరలోనే జైలుకు వెళ్తారు

-

బీజేపీ నేత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీలో చాలా మంది రాజకీయ నాయకులు బెయిల్ పై బయట ఉన్నారని… త్వరలోనే వారంతా జైలుకు వెళ్తారని అన్నారు. తాను మూడు ప్రభుత్వాలను చూశానని.. టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాాలు మూడు కుటుంబ పార్టీలే అని.. ఈ మూడు కూడా కరప్షన్ పార్టీలే అని.. అభివ్రుద్ది నిరోధక పార్టీలే అని ఆయన దుయ్యబట్టారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి పర్యావణ అనుమతులు ఇచ్చామని.. అయినా ఏడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. పోలవరం కట్టడంలో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలు కూడా పోలవరాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

పుష్ప సినిమాలో లాగానే ఈ ప్రభుత్వం హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతోందని ఆయన అన్నారు. అంతర్వేదిలో లక్ష్మీనారాయణ స్వామి రథాన్ని ధ్వంసం చేయడంతో పాటు కోదండ రాముడి విగ్రహాన్ని వైసీపీ గుండాలు ధ్వంసం చేశారని విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తానని… ప్రభుత్వమే మద్యం అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తుందని విమర్శించారు. 2014లో టీడీపీ గెలిచిందంటే కారణం బీజేపీ, మోదీనే అని.. ఆయన స్పష్టం చేశారు. బీజేపీని దూరం పెట్టారని టీడీపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news