ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే రోగ నిరోధక శక్తి అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటే ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది.
అయితే మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందా..?, తక్కువగా ఉందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నారా..? ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దాని కోసం చూద్దాం.
ఎప్పుడూ అలసటగానే అనిపించడం:
ప్రతిసారీ కూడా నీరసంగా ఉండడం, తక్కువ ఓపిక ఉండడం ఇలాంటివి కనుక మీలో ఉన్నట్లయితే మీ యొక్క రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని మీరు గ్రహించవచ్చు.
గాయాలు ఆలస్యంగా మానడం:
ఏదైనా కాలినా లేదు అంటే గాయాలు అయినా సాధారణంగా అయితే ఐదు రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ కనుక అవి మానడానికి అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇలా దీని ద్వారా కూడా ఇమ్యూనిటీని మనం చెప్పొచ్చు.
అజీర్తి సమస్యలు:
అజీర్తి సమస్యలు ఉంటే కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పొచ్చు. రెండు నుండి నాలుగు రోజుల పాటు డయేరియా వంటి సమస్యలు ఉంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉందని మనం తెలుసుకోవచ్చు.
ఎక్కువ ఒత్తిడి:
తీవ్రమైన ఒత్తిడి ఉంటే కచ్చితంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నట్లు తెలుసుకోవచ్చు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఉంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిపింది.
ఎక్కువగా జలుబు కలగడం:
చాలామందికి తరచూ జలుబు చేస్తూ ఉంటుంది అలాగే ఇతర ఇన్ఫెక్షన్లు కూడా సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి. అలా కనుక అయిందంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇమ్యూనిటీపవర్ మీలో ఎక్కువ లేదా తక్కువ ఉందా అని మనం తెలుసుకోచ్చు.