తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలైంది. న్యూ ఇయర్ వేడుకపై అనుమతి ఇవ్వడం పట్ల పిటీషన్ దాఖలైంది. హై కోర్ట్ ఆదేశాలను పట్టించుకోకుండా… ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు ఇచ్చిందంటున్న పిటిషనర్… హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాడు. పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లను ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని ఆరోపణ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ను కోరాడు పిటిషనర్. అయితే ఈ అంశంపై హైకోర్ట్ రేపు విచారిస్తామని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్ వేడుక కోసం ఇటీవల అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక ఈవెంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు.. బార్లు, వైన్స్ అర్థరాత్రి వరకు కొనసాగుతాయని తెలంగాాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మళ్లీ కరోనా కేసులు నమోదవ్వవచ్చని పటిషనర్ హైకోర్ట్ కు విన్నవించాడు. మరోవైపు ఆంక్షలు, కర్ప్యూలు విధిస్తూనే.. ఇలాంటి అనుమతులు ఇవ్వడం పట్ల ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. అయితే రేపు జరిగే విచారణలో హైకోర్ట్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.