గన్ మెన్ లేకుండా తిరుగుతున్నావ్.. జాగ్రత్త : పేర్ని నాని కి సోము వీర్రాజు వార్నింగ్ !

-

వైసీపీ పై మరోసారి సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ లీజుల గురించి మాట్లాడితే ఆ పార్టీ నేతల చొక్కాలు కూడా ఉండవని.. ఆలోచించి మాట్లాడాలని మంత్రి పేర్ని నానిని వినమ్రంగా కోరుతున్నానని చురకలు అంటించారు. పేర్ని నాని చాలా సింపుల్ గా ఉంటారు.. గన్ మెన్ కూడా లేకుండా వెళ్లిపోతారు..కానీ జాగ్రత్త..! కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. మేం దస్ దాటి దిశలోకి వచ్చామనే విషయాన్ని తమ్ముడు కొడాలి నాని గుర్తుంచుకోవాలని.. తమ్ముడుకు తాళ్లు ఎక్కువ.. నాలెడ్జ్ తక్కువ అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి ప్యాంటులు తడిచిపోయాయని.. కరపత్రం ఎన్నికలే జరుగుంటే బీజేపీకి 40 వేల ఓట్లు వచ్చేవని పేర్కొన్నారు. కానీ వైసీపీ డబ్బులు పంచిందే..? ఏజెంట్లను కొన్నదే..?
మా పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుని కోసం 50 కార్లు వెళ్లాయన్నారు.

స్పీకర్ తమ్మినేని ఏదో నాలిక మడతేసి చెబుతున్నారు.. ఎక్కువైందా ఏంటీ..? తమ్మినేని ఓ స్పీకర్.. కొంత సంయమనంతో ఉండాలని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి దమ్ముంటే తమ్మినేని ఉద్యమం చేయాలని.. తమ్మినేని చిన్నప్పుడు ఉద్యమం చేశారట.. ఇప్పుడు వయస్సు అయిపోయిందట అంటూ చురకలు అంటించారు. ఉనికి కోసం సభ పెట్టామని బొత్స ఏదో అంటున్నారు… ఉనికి కోసం పార్టీలు మారేది బొత్సానేనని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news