Bangarraju : ”బంగార్రాజు” టీజర్ రిలీజ్.. ఇక సోగాళ్ళ హంగామా షురూ

-

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా.. బాక్స్‌ ఆఫీసును బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. పంచ‌కట్టు లో స‌ర‌సాలు, చిలిపి వేశాల‌కు బాక్స్ ఆఫీసు మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.

ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” సినిమా టీజరు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజరు లో హీరో నాగ చైతన్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అటు నాగార్జున, రమ్యకృష్ణ కూడా దుమ్ము లేపారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కథకు ఈ స్టోరీ అటాచ్ చేసినట్లు.. ఈ టీజరు చూస్తే అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news