తను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లాలని ప్రయత్నించలేదని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కానీ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలలో చేరాలని తనకు ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు. కాగ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ రెండు సార్లు ఫోన్ చేసి పిలిస్తేనే సీఎం కేసీఆర్ ను కలిసానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రోజే మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఫోన్ చేశాడని తెలిపారు.
అలాగే ఇటీవల మరో సారి సీఎం కేసీఆర్ ఫోన్ చేశాడని అందుకే కలిసానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో వివరించాని తెలిపారు. సీఎం కేసీఆర్ సహ ఉద్యమాకారుడని తెలిపారు. ఉద్యమకారులందరూ తన వెంటే ఉండాలని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తొడ్పాడాలని సూచించారని వివరించారు. అలాగే తాను బీజేపీ లోకి వెళ్లడానికి దారులన్నీ మూసుకుపోతే.. తిరిగి కేసీఆర్ ను కలిసానని కొందరు అంటున్నారని అన్నారు. ఇలాంటి వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపారు.