పట్టణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త…మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఆదేశాలు

-

నిన్న రాత్రి… ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని ఆ సందర్భంగా సిఎం కెసిఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండిఎ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

kcr
kcr

అదేవిధంగా రసూల్ పుర -2, ఎల్.బి.నగర్-1, శేర్ లింగంపల్లి-1, కుత్బుల్లాపూర్-1, కూకట్ పల్లి-1, ఉప్పల్-1, మల్కాజిగిరి-1, జల్ పల్లి-1, మీర్ పేట-1, పిర్జాదీగూడ-1, బోడుప్పల్-1, జవహర్ నగర్-1, నిజాంపేట్ -1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అదే సందర్భంగా హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా జగిత్యాల – 1, సూర్యాపేట – 1, సిద్ధిపేట – 1, మహబూబ్ నగర్-2, నల్గొండ-2, మిర్యాలగూడ-1, రామగుండం-2, ఖమ్మం-2, నిజామాబాద్-3, కరీంనగర్-2, కొత్తగూడెం-1, పాల్వంచ-1, నిర్మల్-1, మంచిర్యాల-1, తాండూర్-1, వికారాబాద్-1, బోధన్-1, ఆర్మూర్-1, కామారెడ్డి-1, సంగారెడ్డి-1, జహీరాబాద్-1, గద్వాల్-1, వనపర్తి-1, సిరిసిల్ల-1, తెల్లాపూర్-1, బొల్లారం-1, అమీన్ పూర్-1, గజ్వేల్-1, మెదక్-1 చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news