తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని రాష్ట్ర కమిటీ తెలిపింది. అయితే జేపీ నడ్డా పాల్గోనే ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపారు. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. ఆ ఆంక్షల లో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి సందర్భాలలో ర్యాలీలకు, ధర్నాలకు, బహిరంగ సభ లకు అనుమతి లేదని తెల్చి చెప్పారు.
అయితే కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదీల ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి దీక్ష చేస్తుండగా కరోనా ఆంక్షల కారణంగా ఆరెస్టు చేశారు. అంతే కాకుండా 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కమిటీ నేటి నుంచి 14 రోజుల పాటు ఆందోళన చేయనుంది. అందులో భాగంగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని రాష్ట్ర కమిటీ ప్రతినిధులు తెలిపారు.