కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో… తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే కట్టడి మార్గమని నిర్ణయం తీసుకున్న… తమిళనాడు సర్కార్ ఈ నెల 9 నుంచి లాక్ డౌన్ ను అమలు చేయనుంది.
ఈనెల 9 వ తేదీ నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఉంటుందా అని ప్రకటించింది స్టాలిన్ సర్కార్. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాలేజీలు కూడా పూర్తిగా మూసి వేయాలని ఆదేశించింది స్టాలిన్ సర్కార్. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే నడపాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కాగా తమిళనాడు రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,731 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు ఓమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తమిళనాడు సర్కార్. త్వరలోనే పూర్తి స్థాయిలో ఉండడం కూడా నటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.