రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. బండి సంజయ్ అరెస్ట్, నడ్డా క్యాండిల్ ర్యాలీ, టీఆర్ఎస్ నేతల కౌంటర్లు, మంత్రి కేటీఆర్ విమర్శలతో తెలంగాణ రాజకీయం వెడెక్కింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ బీజేపీ. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. అక్రమ అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది.
ప్రధానంగా 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు బీజేపీ నేతలపై ముక్యంగా బండి సంజయ్ పై ఇతర నాయకులపై పెట్టిన కేసులపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేపు హన్మకొండలో చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దీక్షలో పాల్గొననున్నారు. కొందరు నేతలు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు.. గులాబీ చొక్కాలు వేసుకోవాలని తరుణ్ చుగ్ తీవ్రంగా విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరిగిందని తరుణ్ చుగ్ అన్నారు.