ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లను నిషేధిస్తున్నాం : కొడాలి నాని సంచలనం

-

ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ను నిషేధిస్తున్నామని ప్రకటించారు. వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ ఈ ఛానళ్ళకు ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు, రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు ఉంది టీడీపి మీడియా తీరు ఉందని.. హెరిటేజ్ లో రేట్ల కంటే మార్కెట్ రేట్ ఎక్కువగా ఉందని ఫైర్ అయ్యారు. హెరిటేజ్ లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ 59 ఉంటే మార్కెట్ రేట్ 52 రూపాయలు ఉందని.. అలాగే అన్ని నిత్యావసర సరుకుల ధరలు మార్కెట్ రేట్ కంటే హెరిటేజ్ లో ఎక్కువగా ఉన్నాయని నిప్పులు చెరిగారు. కొన్ని మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎల్లో మీడియాతో చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news