ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో సంక్రాంతి పండుగ సంబరాలకు వర్షం ఆటంకంగా తయారయింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో మరికాసేపట్లో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి.
గోశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. అయితే భారీ వర్షం నేపథ్యంలో సంక్రాంతి సంబరాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
“మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.” అంటూ ట్వీట్ చేశారు.