తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సిఎం అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ లో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కష్టా లెదురై నా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news